తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్‌రింగ్‌ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు.

Published : 19 May 2024 03:49 IST

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్‌రింగ్‌ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. శిలాతోరణం కూడలి నుంచి క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. కల్యాణవేదిక వద్ద భక్తులను ఉంచి క్యూలైన్‌లో రద్దీ తగ్గిన అనంతరం పంపుతున్నారు. రింగ్‌రోడ్డు నుంచి నారాయణగిరి షెడ్లకు చేరుకునే వరకు ఉన్న క్యూలైన్‌లోని భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాలు, టీ, అన్నప్రసాదాలు సరిగా అందడం లేదని కొందరు తెలిపారు. షెడ్లలోకి చేరుకున్న అనంతరం మాత్రమే అన్నప్రసాదాలు అందిస్తున్నారని చెప్పారు. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు