24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి

రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు.

Published : 19 May 2024 03:51 IST

వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. రబీలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 87 కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలాల్లో 33% పైగా దెబ్బతిని, నష్టపోయిన వివరాలను పంటల వారీగా రూపొందించాలని, ఒక్కో రైతుకు అయిదెకరాలకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా తయారు చేసిన జాబితాలను 25 నుంచి 27వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో సామాజిక తనిఖీకి ఉంచాలని, తుది జాబితాలను 31 లోగా జిల్లా కలెక్టర్ల ద్వారా పంపాలని ఆదేశించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు