స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు.

Published : 19 May 2024 03:52 IST

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా

ఏయూలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రధాన
ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా, కలెక్టర్‌ మల్లికార్జున, సీపీ రవిశంకర్‌

విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం, వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. విశాఖ నగరంలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల పరిధిలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్‌లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌తో కలిసి శనివారం ఉదయం ఆయన పరిశీలించారు. విశాఖపట్నం పార్లమెంటుతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్‌లు ఇక్కడున్నాయి. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను సీఈవోకు కలెక్టర్, పోలీసు కమిషనర్‌ వివరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని