స్ట్రాంగ్‌రూమ్‌ కారిడార్‌లోకి వర్షపు నీరు

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్‌ కారిడార్‌లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Published : 19 May 2024 03:53 IST

నిమ్రా కళాశాలలో అధికారులకు సూచనలు ఇస్తున్న సీపీ రామకృష్ణ.. చిత్రంలో ఆర్వో సంపత్‌కుమార్‌

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్‌ కారిడార్‌లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కళాశాల మొదటి అంతస్తులో మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్‌ను ఏర్పాటుచేశారు. కారిడార్‌లో వర్షపు నీరు నిలవడంతో ఆ నియోజకవర్గ ఆర్వో, జిల్లా సంయుక్త కలెక్టర్‌ సంపత్‌కుమార్, జిల్లా పోలీసు కమిషనర్‌ రామకృష్ణ, ఇతర అధికారులు శనివారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.  స్ట్రాంగ్‌రూమ్‌ ముందు బీమ్‌ నుంచి వర్షపు నీరు చుక్కచుక్కగా కారుతోందని ఆర్వో సంపత్‌కుమార్‌ తెలిపారు. నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురిస్తే ఏదైనా సమస్య వస్తుందన్న భావనతో ముందు జాగ్రత్త కోసం పరిశీలించామని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వానజల్లులతో నీరు గదిలోకి వెళ్లకుండా బయట గుమ్మం వద్ద గట్టులా కట్టినట్టు, బీమ్‌ నుంచి లీకేజీ కాకుండా చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని