ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్‌ అసోసియేషన్‌కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ చెస్‌ అసోసియేషన్‌కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్‌ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Updated : 19 May 2024 06:16 IST

ఈనాడు, అమరావతి: ఏపీ చెస్‌ అసోసియేషన్‌కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్‌ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. తమ అసోసియేషన్‌కు అనుబంధ గుర్తింపును రద్దు చేస్తూ అఖిల భారత చదరంగ సమాఖ్య తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఏపీ చెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై.సుమన్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. పిటిషనర్‌ వినతిని పరిగణనలోకి తీసుకొని గుర్తింపు విషయంలో తగిన ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించారు. అయినప్పటికీ నిర్ణయం వెల్లడించకపోవడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన జాతీయ క్రీడల కోడ్‌ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి రాష్ట్ర అసోసియేషన్‌కు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిన చట్టబద్ద బాధ్యత అఖిల భారత చదరంగ సమాఖ్యకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ వినతిని పరిగణనలోకి తీసుకొని ఆరు వారాల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని