ఇదీ స్ట్రాంగ్‌రూమే.. టార్పాలిన్‌ కప్పి ఉంచిన గదిలో పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలు

చిత్రంలో టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌.

Updated : 20 May 2024 09:12 IST

చిత్రంలో టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌. బాపట్ల తహసీల్దారు కార్యాలయంలోని ఈ గదిని గతంలో వీఆర్వోలు ఉపయోగించుకునేవారు. వర్షాలు పడే సమయంలో పైకప్పు నుంచి నీరుకారుతుండటంతో కొంతకాలంగా సిబ్బంది ఎవరూ దీనిలో ఉండట్లేదు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఈ గదిలోనే ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సులు ఉంచడంతో వాటి భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి గదిలో పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సులను ఉంచడంపై రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గ వ్యాప్తంగా 2,899 పోస్టల్‌ బ్యాలట్ల ఓట్లకు గాను 2,719 పోలయ్యాయి.

న్యూస్‌టుడే, బాపట్ల, బాపట్ల పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని