డాక్టర్‌ లోకేశ్‌ కేసు నమోదుకు అనుమతివ్వండి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శాటిలైట్‌ ఫోన్‌తో వచ్చారన్న ఆరోపణలపై ప్రవాస వైద్యుడు డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌పై కేసు నమోదుకు అనుమతివ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు సోమవారం స్థానిక కోర్టును ఆశ్రయించారు.

Updated : 21 May 2024 04:35 IST

విజయవాడ, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శాటిలైట్‌ ఫోన్‌తో వచ్చారన్న ఆరోపణలపై ప్రవాస వైద్యుడు డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌పై కేసు నమోదుకు అనుమతివ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు సోమవారం స్థానిక కోర్టును ఆశ్రయించారు. డాక్టర్‌ లోకేశ్‌ దిల్లీ వెళ్లేందుకు ఆదివారం ఉదయం విమానాశ్రయానికి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా శాటిలైట్‌ ఫోన్‌ కలిగి ఉన్నారన్న ఆరోపణలపై భద్రతా సిబ్బంది ఆయనను అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని