మంత్రి పెద్దిరెడ్డి అండతో నరేగా సంచాలకులుగా మరోసారి చినతాతయ్య

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) సంచాలకులు చినతాతయ్య పదవీకాలం ఈ నెలలో ముగియనుండగా.. మరో ఏడాదిపాటు ప్రభుత్వం పొడిగించింది.

Published : 21 May 2024 02:56 IST

ఈనాడు, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) సంచాలకులు చినతాతయ్య పదవీకాలం ఈ నెలలో ముగియనుండగా.. మరో ఏడాదిపాటు ప్రభుత్వం పొడిగించింది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆయన పదవీకాలం పొడిగింపు ఇది మూడోసారి. చినతాతయ్య పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఎండీగా ఉద్యోగవిరమణ చేశాక.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో నరేగా సంచాలకులుగా నియమితులయ్యారు. ఎంతో కీలకమైన ఈ పోస్టులో ఉమ్మడి రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు పనిచేశారు. విభజన తర్వాత గ్రామీణాభివృద్ధి రంగంలో అనుభవం కలిగిన గ్రూపు-1 అధికారులు సేవలందించారు. ఉద్యోగవిరమణ చేసిన చినతాతయ్యను నరేగాలో ముఖ్యమైన సంచాలకుల పోస్టులో నియమించడంతో అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. పెద్దిరెడ్డి సొంత జిల్లాకు చెందిన చినతాతయ్య.. మంత్రి ఆశీస్సులతో ఎప్పటికప్పుడు తన పదవీకాలాన్ని పొడిగించుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ను ముందుగానే ఊహించిన చినతాతయ్య.. మార్చిలోనే కొనసాగింపు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అది ఇప్పుడు అమలులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు