రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన

తాము వెళ్లాల్సిన విమాన సర్వీసును రద్దుచేయడంతో రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

Published : 21 May 2024 02:56 IST

రేణిగుంట, న్యూస్‌టుడే: తాము వెళ్లాల్సిన విమాన సర్వీసును రద్దుచేయడంతో రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రేణిగుంట నుంచి కర్ణాటకలోని కలబురిగికి స్టార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం సోమవారం సాయంత్రం 4.20కి బయలుదేరాలి. 32 మంది ప్రయాణికులు నిర్ణీత సమయానికి అక్కడికి చేరుకున్నాక సర్వీసును రద్దుచేసినట్లు సిబ్బంది చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా రద్దుచేశారని సిబ్బందిని ప్రశ్నించారు. తర్వాత అక్కడి ఎయిర్‌లైన్స్‌ టికెట్‌ కౌంటర్‌ ముందు నిరసన చేపట్టారు. సిబ్బంది పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాసేపటికి సిబ్బంది.. టికెట్‌ డబ్బులు తిరిగి చెల్లిస్తామని లేదా మరో సర్వీసులో పంపిస్తామని చెప్పడంతో శాంతించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కొందరు ప్రయాణికులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని