ప్రాథమిక వివరాల ఆధారంగా పంటనష్టం జాబితాలు

కోతలు పూర్తయినా పొలంలో పంట ఉన్నప్పుడు తీసుకున్న నష్టం వివరాల ఆధారంగా పంటనష్టం గణన పూర్తిచేసి జాబితాలు తయారుచేస్తామని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు.

Published : 21 May 2024 02:57 IST

ఈనాడు, అమరావతి: కోతలు పూర్తయినా పొలంలో పంట ఉన్నప్పుడు తీసుకున్న నష్టం వివరాల ఆధారంగా పంటనష్టం గణన పూర్తిచేసి జాబితాలు తయారుచేస్తామని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. ‘పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా?’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో వచ్చిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. కరవు మండలాల ప్రకటన తర్వాత జిల్లాల నుంచి తీసుకున్న ప్రాథమిక నివేదికలకు అనుగుణంగా పంట నష్టపోయిన జాబితాలు తయారుచేస్తామని వివరించారు. 6 జిల్లాల్లోని 87 మండలాల్లో 2.37 లక్షల మంది రైతులు 2.52 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని ప్రాథమిక నివేదికలో అంచనా వేశారని హరికిరణ్‌ పేర్కొన్నారు. రబీలో కరవు పరిశీలనకు బృందాన్ని పంపాలని కోరుతూ కేంద్రానికి వినతిపత్రం పంపామని, ఎన్నికల దృష్ట్యా వారి రాక ఆలస్యమైందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ ప్రకటనలో వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని