ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత

ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) సోమవారం వెల్లడించింది.

Published : 21 May 2024 04:42 IST

ప్రకటించిన ఆశా

ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) సోమవారం వెల్లడించింది. ‘గత ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి.  వీటి విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉంది. రూ.530 కోట్ల విలువైన బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఈ నెల 2న సీఈఓ చెపారు. ఇప్పటివరకు చెల్లించలేదు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సుమారు రూ.50 కోట్ల బిల్లుల చెల్లింపులే జరిగాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించాం’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని