నాలుగు సబ్‌డివిజన్లకు కొత్త డీఎస్పీలు

రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్‌డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది.

Updated : 21 May 2024 03:55 IST

ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసిన వారి స్థానంలో నియామకం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్‌డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. వీరితోపాటు మరికొన్ని స్థానాల్లోనూ నియామకాలు చేపట్టింది. పోలింగ్‌ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం మొత్తం 12 మంది డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. వారిస్థానంలో ఈ కొత్త అధికారులను నియమించింది. వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని