శ్రీవారి వీఐపీ బ్రేక్‌ టికెట్ల జారీ పునఃప్రారంభం

ఎన్నికల కోడ్‌ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు.

Published : 21 May 2024 04:48 IST

సిఫార్సు లేఖలు స్వీకరిస్తున్న తితిదే

తిరుమల, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీల సిఫారుసుపై బ్రేక్‌ టికెట్ల జారీకి అనుమతించాలన్న తితిదే విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. బోర్డు సభ్యులకు గతంలో తరహాలోనే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ.300 ఎస్‌ఈడీ టికెట్లు, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్‌ టికెట్లను సిఫార్సు లేఖలపై జారీ చేస్తున్నారు.    

  • శ్రీవారి సర్వదర్శనానికి సోమవారం దాదాపు 16 గంటలు పట్టింది.
  • అలిపిరి నడకదారి సమీపంలో ఆఖరి మెట్ల వద్ద సోమవారం రెండు చిరుతలు సంచరిస్తుండగా భక్తులు వాటిని చూసి కేకలు వేశారు. దీంతో అవి అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. ఆ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని