కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు.

Published : 21 May 2024 04:04 IST

హైదరాబాద్‌: కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. 2022 నుంచి కోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్న జయ ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. ఈ రంగంలో ఎందరికో మార్గదర్శకురాలిగానూ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టిన జయ బాడిగ హైదరాబాదులో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. 1991-1994 నడుమ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, పొలిటికల్‌ సైన్సు సబ్జెక్టులతో బీఏ చేశారు. బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్య అభ్యసించారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ అటార్నీగా, గవర్నర్‌ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలోనూ ఈమె పనిచేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని