పోలీసులు అమాయకులను బలిచేశారు

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సుధాకర్‌రెడ్డి, హరికృష్ణను అన్యాయంగా ఇరికించి కడప జైలుకు తరలించారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 21 May 2024 03:50 IST

పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో రెండు కుటుంబాల ఆవేదన


సుధాకర్‌రెడ్డి, హరికృష్ణ ఫొటోలను చూపుతున్న కుటుంబసభ్యులు 

తిరుపతి (భవానీనగర్‌), న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సుధాకర్‌రెడ్డి, హరికృష్ణను అన్యాయంగా ఇరికించి కడప జైలుకు తరలించారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సుధాకర్‌రెడ్డి భార్య మహేశ్వరి, హరికృష్ణ తల్లి భువనేశ్వరి విలేకర్లతో మాట్లాడారు. ఈ ఘటన జరిగిన రోజు హరికృష్ణ తమిళనాడులో ఉన్నారని, సుధాకర్‌రెడ్డి పాపవినాశనంలోని దుకాణంలో వ్యాపారం చేసుకుంటున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం స్పందించి న్యాయం చేయాలని మీడియా ఎదుట వారు కన్నీటి పర్యంతమయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని