జూ.ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 21 May 2024 04:05 IST

పురందేశ్వరి కూడా

ఈనాడు, అమరావతి: జూనియర్‌ ఎన్టీఆర్‌కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌ వేదికగా ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ‘రాబోయే ఏడాదంతా మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు