గులకరాయి కేసు.. నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

Published : 21 May 2024 04:06 IST

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సతీష్‌కు బెయిల్‌ మంజూరుచేయాలని ఆయన తరఫు న్యాయవాది సలీం పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి విదితమే. ఎనిమిదో ఏడీఏ ఇన్‌ఛార్జి కోర్టు అయిన ఎంఎస్‌జే కోర్టులో సోమవారం పీపీ కౌంటరు దాఖలు చేయాల్సి ఉంది. దీనికి ఆయన సమయం కోరడంతో న్యాయాధికారి సత్యానంద్‌ ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని