ఏపీసీపీఎస్‌ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీసీపీఎస్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పఠాన్‌ బాజీ, కరిమి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు.

Published : 21 May 2024 04:06 IST

ఈనాడు, అమరావతి: ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీసీపీఎస్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పఠాన్‌ బాజీ, కరిమి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన సంఘ కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు రాజేశ్వరరావు తెలిపారు. సంఘం కోశాధికారిగా జహీర్‌ అబ్బాస్, సహ అధ్యక్షుడిగా చీర్లా కిరగ్, గౌరవాధ్యక్షుడిగా పాలెల రామాంజనేయులు ఎన్నికైనట్లు వెల్లడించారు. సీపీఎస్‌ ఉద్యోగులకు ఐదేళ్లుగా ఇవ్వాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిలు జూన్‌ 15లోపు ఇవ్వకపోతే ఆ తర్వాత చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 10 లోపు సీపీఎస్‌ రద్దుచేసి, పాత పింఛను విధానాన్ని అమలు చేయకపోతే సెప్టెంబరు 1న విజయవాడలో ధర్నా చేపడతామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని