24 నుంచి ‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు.

Published : 21 May 2024 04:07 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని వెల్లడించారు. హాల్‌టికెట్లను విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు. ఈ నెల 24, 25, 27 తేదీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ భాషా సబ్జెక్టులు, 28, 29, 30, 31 తేదీల్లో గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం పరీక్షలు ఉంటాయని.. జూన్‌ 1, 3 తేదీల్లో ఓఎస్‌ఎస్‌ పేపర్‌-1, 2 నిర్వహిస్తున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని