ఎన్నికల ఘర్షణ కేసుల్లో 4,668 మంది గుర్తింపు

ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో 4,668 మందిని గుర్తించి కొంత మందిని అరెస్ట్‌ చేశామని, మరికొందరికి నోటీసులు జారీ చేశామని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు.

Published : 22 May 2024 02:59 IST

కొంతమంది అరెస్ట్, పలువురికి నోటీసులు
డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా వెల్లడి

ఈనాడు, అమరావతి: ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో 4,668 మందిని గుర్తించి కొంత మందిని అరెస్ట్‌ చేశామని, మరికొందరికి నోటీసులు జారీ చేశామని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసిన ఈ కేసుల్లో 85 మందిపై హిస్టరీ షీట్‌ తెరచినట్టు పేర్కొన్నారు. ముగ్గురిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని, మరో ఇద్దరిని బహిష్కరణ చేయాలని ఆదేశించినట్టు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 301 సమస్యాత్మక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కార్డన్‌ సర్చ్‌ నిర్వహించామని డీజీపీ తెలిపారు. ఎలాంటి పత్రాలూ లేని 1,104 వాహనాలను జప్తు చేసినట్టు వెల్లడించారు. 482 లీటర్ల ఐడీ లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్‌డ్యూటీ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సమాచారముంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 112/100కు నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని