ఏబీ వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

Published : 22 May 2024 03:00 IST

దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
రేపు విచారించనున్న వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం

ఈనాడు, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. క్యాట్‌ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు, డీజీపీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ఈనెల 23న ఈ వ్యాజ్యంపై విచారించనుంది.

తనను సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారించిన క్యాట్‌.. ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్‌ చేయడం చెల్లదని తేల్చిచెప్పింది. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తక్షణం బాధ్యతలు అప్పగించాలని, వేతన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జగన్‌ సర్కారుకు క్యాట్‌ తీర్పు మింగుడుపడకపోవడంతో తాజాగా హైకోర్టులో వ్యాజ్యం వేసింది. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంలో క్యాట్‌ పొరపడిందని అఫిడవిట్లో పేర్కొంది. ఆయన్ను పునర్నియమిస్తే దిగువ కోర్టులో విచారణపై ప్రభావం చూపుతుందని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో తమ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారించాలని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని