62 ఏళ్లు పూర్తయ్యేవరకూ సర్వీసులో కొనసాగొచ్చు

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)లో పనిచేస్తున్న ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యేవరకు సర్వీసులో కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పీఏసీఎస్‌ ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవీ విమరణ చేసి, ఇంకా 62 ఏళ్లు పూర్తికాకుంటే అలాంటివారిని పునర్నియమించాలని ఆదేశించింది.

Published : 22 May 2024 05:19 IST

పీఏసీఎస్‌ ఉద్యోగుల విషయంలో హైకోర్టు స్పష్టం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)లో పనిచేస్తున్న ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యేవరకు సర్వీసులో కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పీఏసీఎస్‌ ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవీ విమరణ చేసి, ఇంకా 62 ఏళ్లు పూర్తికాకుంటే అలాంటివారిని పునర్నియమించాలని ఆదేశించింది. వేతన బకాయిలూ చెల్లించాలని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వు 60 ఏళ్లు పూర్తికావడానికి ముందు వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకూ వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు వేయగా కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని