విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు.. ఏడాదికి రెండు సార్లు సందర్శించాలి: ప్రవీణ్‌ ప్రకాశ్‌

విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు ఏడాదికి రెండు పర్యాయాలు సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సూచించారు.

Updated : 22 May 2024 08:36 IST

ఈనాడు, అమరావతి: విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు ఏడాదికి రెండు పర్యాయాలు సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సూచించారు. ‘తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల గృహ సందర్శన’ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని, జూన్‌లో ఒకసారి, జనవరిలో మరోసారి విద్యార్థుల ఇళ్లను సందర్శించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల హాజరు, ప్రవర్తన, అభ్యాసనలో పెరుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో మంగళవారం నిర్వహించిన ‘ఫ్రమ్‌ ద డెస్క్‌ ఆఫ్‌ ది ప్రిన్సిపల్‌ సెక్రటరీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఒకరిపై మరొకరు నెపం..: విద్యార్థులకు మార్కులు తక్కువ రావడంపై ఇంటర్మీడియట్‌ నుంచి ప్రాథమిక విద్య వరకు ఒకరిపై మరొకరు నెపాన్ని నెట్టుకుంటున్నారని ప్రవీణ్‌ప్రకాశ్‌ అన్నారు. ‘పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లోని సాధారణ విద్యార్థులు సగటున 358 మార్కులు సాధిస్తే.. ప్రైవేటు బడుల్లోని విద్యార్థులు 479 మార్కులు సాధించారు. ప్రభుత్వ బడుల్లో చదువులో మధ్యస్థంగా ఉండే విద్యార్థులు సగటున 371 మార్కులు సాధిస్తే ప్రైవేటు వారికి 499మార్కులు వచ్చాయి. ఎక్కువ మార్కులు వచ్చిన వారి సగటు చూస్తే ప్రభుత్వ విద్యార్థులు 385 సాధిస్తే ప్రైవేటులో 554 సాధించారు. ఈ వ్యత్యాసం ఇంటర్మీడియట్‌లోనూ ఉంది. జూనియర్‌ లెక్చరర్లు 8, 9, 10 తరగతుల్లో సరిగా బోధన చేయడం లేదని స్కూల్‌ అసిస్టెంట్లపైకి, స్కూల్‌ అసిస్టెంట్లు ప్రాథమిక స్థాయిలో సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయంటూ ఎస్జీటీలపైకి, ఎస్జీటీ టీచర్లు విద్యార్థుల ఇళ్లలో అకడమిక్‌ వాతావరణం ఉండటం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు’’ అని ప్రవీణ్‌ప్రకాశ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు