ఏపీలో 5 వేల మంది ఒప్పంద ఉపాధ్యాయినుల మెడపై కత్తి

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) చర్యలు చేపట్టింది.

Published : 22 May 2024 06:02 IST

ఈనాడు, అమరావతి: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) చర్యలు చేపట్టింది. కేజీబీవీలు, భవిత కేంద్రాల్లో ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో 5 వేల మందికిపైగా ఒప్పంద ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఒకరోజు విరామంతో సంవత్సర కాలానికి ఒప్పందాన్ని పొడిగించేవారు. ఈ సారి జూన్‌ 9 వరకు మాత్రమే పొడిగించారు. ఈ లోపు 2023-24 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల పనితీరును ఎస్‌ఎస్‌ఏ మదింపు చేయనుంది. కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు, పీజీటీలకు తదితరులకు 20 మార్కులకు పనితీరును అంచనా వేస్తున్నారు.దీనిపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పనితీరు బాగోలేదంటూ ఉద్యోగాల నుంచి తొలగించేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు