ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

జగన్‌ ప్రభుత్వం అక్రమంగా, చట్ట విరుద్ధంగా సస్పెండ్‌ చేసిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ ‘ఏపీ టుమారో’.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌కు లేఖ రాసింది.

Updated : 23 May 2024 06:43 IST

సర్వీసు పొడిగించి అనుభవానికి తగిన పోస్టింగ్‌ ఇవ్వాలి
సీఈసీకి ఏపీ టుమారో సంస్థ లేఖ 

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వం అక్రమంగా, చట్ట విరుద్ధంగా సస్పెండ్‌ చేసిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ ‘ఏపీ టుమారో’.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌కు లేఖ రాసింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా చేపట్టిన ఆన్‌లైన్‌ ఉద్యమంలో మూడు రోజుల వ్యవధిలో 87 దేశాల నుంచి 32,138 మంది సంతకాలు చేశారు. ఈ నివేదికను కూడా సీఈసీకి పంపింది. ఎన్నికల సంఘానికి ఉన్న అసాధారణ అధికారాలు ఉపయోగించి నిజాయతీపరుడైన ఏబీ వెంకటేశ్వరరావుకు న్యాయం చేయాలని కోరింది. విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. సర్వీసును నెల రోజుల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. ఆయన అనుభవానికి తగిన పోస్టింగ్‌ ఇచ్చేలా జూన్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి తగు ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రజల తరఫున  ఏపీ టుమారో విజ్ఞప్తి చేసింది. కమిషన్‌కు ఉన్న విచక్షణాధికారంతో నిజాయతీపరులైన అధికారులను కాపాడాలని లేఖలో సంస్థ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని