వైభవంగా సత్యదేవుని రథోత్సవం

సత్యదేవుని కల్యాణోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా అన్నవరంలో బుధవారం సాయంత్రం రథోత్సవం వైభవంగా జరిగింది.

Updated : 23 May 2024 06:09 IST

సత్యదేవుని రథోత్సవంలో పాల్గొన్న భక్త జనం

అన్నవరం, న్యూస్‌టుడే: సత్యదేవుని కల్యాణోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా అన్నవరంలో బుధవారం సాయంత్రం రథోత్సవం వైభవంగా జరిగింది. రూ.కోటి వ్యయంతో 34.1 అడుగుల ఎత్తున నూతనంగా నిర్మించిన భారీ రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి ఆసీనులను చేశారు. దేవస్థాన కమిటీ ఛైర్మన్‌ ఐవీ రోహిత్, ఈవో రామచంద్రమోహన్‌లు టెంకాయలు కొట్టి రథాన్ని ముందుకు లాగారు. అన్నవరం ప్రధాన రహదారి మీదుగా సాగిన ఈ రథోత్సవంలో  వేల మంది భక్తులు పాల్గొన్నారు.

రథంపై స్వామి, అమ్మవారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు