ఆన్‌లైన్‌లోనే ఇంటర్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనం

రాష్ట్రంలో ఇంటర్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో ఇంటర్మీడియట్‌ విద్యామండలి నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇకపై ఆన్‌లైన్‌లోనే ప్రశ్నపత్రాలను దిద్దనున్నారు.

Updated : 24 May 2024 06:14 IST

సప్లిమెంటరీ పరీక్షల నుంచి ప్రారంభం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఇంటర్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో ఇంటర్మీడియట్‌ విద్యామండలి నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇకపై ఆన్‌లైన్‌లోనే ప్రశ్నపత్రాలను దిద్దనున్నారు. ఈ విధానాన్ని ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు విద్యార్థుల ప్రశ్నపత్రాలను ఆయా జిల్లా కేంద్రాలకు తరలించి మూల్యాంకనం చేయించేవారు.

 ఆన్‌లైన్‌లో మూల్యాంకనం ఇలా.. 

ఆన్‌లైన్‌ మూల్యాంకనంలో ఒక్కో ప్రశ్నపత్రాన్ని ఇద్దరు అధ్యాపకులు దిద్దుతారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రీజనల్‌ రిసెప్షన్‌ అండ్‌ స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో అధ్యాపకుని ల్యాప్‌ట్యాప్‌కు రోజుకు 50 ప్రశ్నపత్రాలు పంపిస్తారు. వీటిని వారు పనిచేస్తున్న కళాశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో దిద్దనున్నారు. ఒక్కో ప్రశ్నపత్రాన్ని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులతో విడివిడిగా మూల్యాంకనం చేయిస్తారు. వీరిద్దరూ వేసిన మార్కుల్లో అత్యధికంగా వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. దీనిపై అనకాపల్లి జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి బి.సుజాత మాట్లాడుతూ.. ఈ ఏడాది బోర్డు కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని.. ప్రతి కళాశాలలోనూ నిఘా కెమెరాలు ఉన్న గదిలోనే మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని