గురజాల పోలీసుల అదుపులో పిన్నెల్లి కారు, డ్రైవరు

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు, డ్రైవరును గురజాల పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లిపై కేసు నమోదైంది.

Published : 24 May 2024 04:07 IST

గురజాల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు, డ్రైవరును గురజాల పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు బుధ, గురువారాల్లో జిల్లా పోలీసులు తెలంగాణలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకొని, ఆయన డ్రైవరును అదుపులోకి తీసుకుని, గురజాల స్టేషన్‌కు తీసుకొచ్చారు. తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని