సీఎం జగన్‌ చెప్పారని మమ అనిపించారు..

రెండున్నరేళ్ల కిందట ఒక రోజు సీఎం జగన్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి వెళుతూ విజయవాడ నగరం ప్రసాదంపాడు వద్ద నాలా నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించి.. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Published : 24 May 2024 05:44 IST

రెండున్నరేళ్ల కిందట ఒక రోజు సీఎం జగన్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి వెళుతూ విజయవాడ నగరం ప్రసాదంపాడు వద్ద నాలా నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించి.. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అప్పుడు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆ మురుగు కాలువల వెంట పరుగులు తీసి హడావుడి చేశారు. పక్కా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని, జాతీయ రహదారిని తాకకుండా ఆటోనగర్‌ నుంచి నిడమానూరు మీదుగా మురుగు నీటిని పంపించాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత నాలాపై ఇలా రేకులు కప్పి మమ అనిపించారు. ఇటీవల ఆ రేకులు తుప్పుపట్టి విరిగిపోతున్నాయి. శాశ్వత పరిష్కారానికి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని