బకాయిలు చెల్లించనందున.. మెరుగైన వైద్యాన్ని అందించలేకపోతున్నాం

ప్రభుత్వం నుంచి బకాయిల చెల్లింపులు సక్రమంగా జరగకపోతుండడంతో.. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించలేకపోతున్నామని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆశా) వెల్లడించింది.

Updated : 24 May 2024 05:35 IST

ఆశా వెల్లడి

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం నుంచి బకాయిల చెల్లింపులు సక్రమంగా జరగకపోతుండడంతో.. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించలేకపోతున్నామని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆశా) వెల్లడించింది. ఆరోగ్యశ్రీ కింద రోగులు, ఉద్యోగులకు సేవల నిలిపివేతపై గురువారం ఓ ప్రకటన జారీచేసింది. ‘ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులకు రూ.1,500 కోట్లకుపైగా బకాయిల చెల్లింపులు జరగాలి. ఇందులో కేవలం రూ.203 కోట్ల విడుదలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సుమారు 8 నెలల నుంచి ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగనందువల్ల ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది. సిబ్బందికి కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నాయి. వెంటనే రూ.800 కోట్ల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈఓను కోరాం’ అని తెలిపింది. కాగా పలు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు అక్కడక్కడ అంతరాయం ఏర్పడుతుండగా.. దీనిపై నెలకొన్న గందరగోళం రోగులను ఆందోళనకు గురిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని