తిరుమలలో సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. సమయ నిర్దేశిత సర్వదర్శనం (టైంస్లాట్‌) టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో ఉన్న భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్‌ భవనం కూడలి వరకు వేచి ఉన్నారు.

Updated : 25 May 2024 06:14 IST

సర్వదర్శనం క్యూలైన్‌లో రింగ్‌రోడ్డులోని శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. సమయ నిర్దేశిత సర్వదర్శనం (టైంస్లాట్‌) టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో ఉన్న భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్‌ భవనం కూడలి వరకు వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటలకుపైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. గురువారం శ్రీవారిని 65,416 మంది భక్తులు దర్శించుకున్నారు.

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు 

శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నందున జూన్‌ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. సామాన్య భక్తులకు సత్వరం శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేశారు. సిఫారసు లేఖలు స్వీకరించబోమని తితిదే పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని