సీసీ టీవీ లింక్‌ ఇవ్వడంపై వివరాలు సమర్పించండి

స్ట్రాంగ్‌ రూముల వద్ద నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి లింక్‌లను అభ్యర్థులకు ఇచ్చేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ అభ్యర్థి కేఏ పాల్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

Published : 25 May 2024 04:42 IST

ఈసీకి హైకోర్టు ఆదేశం
విచారణ 30కి వాయిదా

ఈనాడు, అమరావతి: స్ట్రాంగ్‌ రూముల వద్ద నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి లింక్‌లను అభ్యర్థులకు ఇచ్చేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ అభ్యర్థి కేఏ పాల్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. అభ్యర్థులకు సీసీ టీవీ లింక్‌ ఇవ్వడం, స్ట్రాంగ్‌ రూముల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై వివరాలు సమర్పించాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. స్ట్రాంగ్‌ రూములను పర్యవేక్షించుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలన్న ఈసీ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డి ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. గురువారం జరిగిన విచారణలో కేఏ పాల్‌ వాదనలు వినిపించారు. గత ఎన్నికల్లో అభ్యర్థులకు స్ట్రాంగ్‌ రూముల సీసీ టీవీ కెమెరాల లింక్‌లను ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో అలాంటి అవకాశం ఇవ్వలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని