‘తెల్ల’బోకండీ.. ఇదీ కాకే!

ఏలూరు జిల్లా కైకలూరులోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో తెల్ల కాకి కనిపించింది. స్థానికులు ఆసక్తిగా, ఆశ్చర్యంగా తిలకించారు.

Updated : 25 May 2024 06:26 IST

ఏలూరు జిల్లా కైకలూరులోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో తెల్ల కాకి కనిపించింది. స్థానికులు ఆసక్తిగా, ఆశ్చర్యంగా తిలకించారు. తెల్లగా ఉండటానికి.. మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం తగ్గుదల, జన్యు లోపాలే కారణమని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలోని జంతుశాస్త్ర అధ్యాపకులు కె.బాబు తెలిపారు. దీనిని ‘అల్బినిజం’ అని పిలుస్తారని వివరించారు. ఇటీవల ఒడిశా, కేరళలోనూ తెల్లని కాకులు కనిపించాయన్నారు.

ఈనాడు, కైకలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని