ఒక ట్యాంకరు.. వందల బిందెలు

కాకినాడలో ప్రధాన పైపులైను మరమ్మతుల కోసం మూడు రోజుల నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో రాజీవ్‌గృహ సముదాయాలు, టిడ్కో గృహాలు, దుమ్ములపేట, పర్లోపేట, సంజయ్‌నగర్, అయోధ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో తాగునీటి జనం ముప్పుతిప్పలు పడుతున్నారు.

Published : 26 May 2024 06:56 IST

కాకినాడలో ప్రధాన పైపులైను మరమ్మతుల కోసం మూడు రోజుల నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో రాజీవ్‌గృహ సముదాయాలు, టిడ్కో గృహాలు, దుమ్ములపేట, పర్లోపేట, సంజయ్‌నగర్, అయోధ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో తాగునీటి జనం ముప్పుతిప్పలు పడుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అవి చాలడం లేదు. ఒక్క ట్యాంకర్‌ రాగానే.. వందలమంది బిందెలతో వస్తున్నారు. మరమ్మతులు పూర్తిచేసి మంగళవారం నాటికి నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. రాజీవ్‌ గృహకల్ప సముదాయాల వద్ద శనివారం కనిపించిన చిత్రమిది.

న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్‌(కాకినాడ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని