సంక్షిప్త వార్తలు (3)

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated : 27 May 2024 05:27 IST

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ఆలయం ఎదుట కుటుంబసభ్యులతో జస్టిస్‌ సీటీ రవికుమార్‌. చిత్రంలో తితిదే న్యాయాధికారి వై.వీర్రాజు తదితరులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితోపాటు తితిదే న్యాయాధికారి వై.వీర్రాజు, జిల్లా ప్రొటోకాల్‌ న్యాయమూర్తి ఎం.గురునాథ్, ప్రొటోకాల్‌ మున్సిఫ్‌ న్యాయమూర్తి పి.కోటేశ్వరరావు, పీఆర్వో ధనంజయనాయుడు తదితరులు పాల్గొన్నారు.


కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న జస్టిస్‌ దుప్పల వెంకటరమణ

ఆలయం వద్ద జస్టిస్‌ దుప్పల వెంకట రమణ, డాక్టర్‌ ఓవీ రమణ

ఈనాడు, అమరావతి: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని కాశీ విశ్వనాథుడిని మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేశారు. న్యాయమూర్తి వెంట ఆయన స్నేహితుడు డాక్టర్‌ ఓవీ రమణ ఉన్నారు.  


ఒక్క ప్రసవమూ చేయని పీహెచ్‌సీ వైద్యులపై చర్యలు

ప్రజారోగ్య కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: అయిదేళ్లుగా ఒక్క ప్రసవమూ చేయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆ శాఖ డైరెక్టర్‌ని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెరగకుంటే కఠిన చర్యలుంటాయని ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. 18 ఏళ్లు నిండినవారికిచ్చే ‘టీబీ బీసీజీ’ టీకాల విషయంలో వెనకబడిన గుంటూరు, విశాఖ జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాపట్ల జిల్లాలో ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) లబ్ధిదారుల జాబితాలో అనర్హుల్ని చేర్చారన్న విషయంపై సమగ్ర నివేదిక పంపాలని ఆ జిల్లా డీఎంహెచ్‌ఓని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని