తిరుమలలో కొద్దిగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ ఆదివారం ఉదయం కొంత తగ్గింది. ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి కృష్ణతేజ అతిథిగృహం వరకు క్యూలైన్‌లో వేచి ఉన్నారు.

Updated : 27 May 2024 06:42 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ ఆదివారం ఉదయం కొంత తగ్గింది. ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి కృష్ణతేజ అతిథిగృహం వరకు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. శనివారం 83,866 మంది భక్తులు దర్శించుకోగా రూ.4.15 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు