అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీ, ఎస్బీ సీఐలపై వేటు

రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జరిగిన అల్లర్లలో.. పోలీసు అధికారుల వైఫల్యాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి.

Published : 27 May 2024 04:03 IST

డీజీపీ కార్యాలయానికి సరెండర్‌
అల్లర్ల అణచివేతలో వైఫల్యంపై చర్యలు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జరిగిన అల్లర్లలో.. పోలీసు అధికారుల వైఫల్యాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఈ వ్యవహారంలో తాజాగా జిల్లా ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా స్పెషల్‌ బ్రాంచి సీఐ జాకీర్‌ హుస్సేన్‌లపై వేటు పడింది. వీరిద్దరినీ డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అల్లర్లు జరుగుతున్న వేళ.. బలగాలను మోహరించకపోవడం, అధికారులకు సరైన సమాచారం అందజేయకపోవడం, జిల్లాకు వచ్చిన నూతన ఉన్నతాధికారులతో బాధ్యతా రహితంగా వ్యవహరించడం వంటి కారణాలతో వీరిపై వేటు వేసినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఏఎస్పీ, సీఐలు ఆదివారం రిపోర్టు చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని