సీఎస్‌ జవహర్‌రెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలి

అనేక విషయాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఎన్నికల కమిషన్‌ను కోరారు.

Published : 27 May 2024 04:23 IST

పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు 

రాజమహేంద్రవరం (దానవాయిపేట), న్యూస్‌టుడే: అనేక విషయాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఆయన ఆదివారం రాజమహేంద్రవరంలో ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎస్‌గా ఉన్న జవహర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ఉత్తరాంధ్రలో పేదలకు ఇచ్చిన ఎసైన్డ్‌ భూములను అతితక్కువ ధరకు వైకాపా అగ్రనాయకుల ఆదేశాల మేరకు బినామీ పేర్లతో కొనుగోలు చేశారన్నారు. వీటికి చట్టబద్ధత కల్పించుకునేందుకు 2023 అక్టోబరులో రెవెన్యూ శాఖతో జీవో 596 జారీ చేయించారన్నారు. సీఎస్‌ను ఎన్నికల బాధ్యతల నుంచి పక్కనపెట్టి 4న కౌంటింగ్‌ సక్రమంగా జరిగేలా చూడాలనికోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆయన లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్‌ నిర్ణయాలేవీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరినట్లు ముప్పాళ్ల తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని