రఘునాథశర్మ, నలిమెల భాస్కర్‌లకు ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కార ప్రదానం

హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

Updated : 27 May 2024 06:15 IST

డా.నలిమెల భాస్కర్‌కు ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న
జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి. చిత్రంలో కె.శ్రీనివాస్, వెల్చాల కొండలరావు, రామచంద్రమూర్తి, కసిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఆచార్య రవ్వా శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం) విశ్రాంత ఆచార్యుడు శలాక రఘునాథశర్మ, ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల (కరీంనగర్‌) విశ్రాంత అధ్యాపకుడు, ప్రముఖ తెలుగు భాషా సాహిత్య పరిశోధకుడు డా.నలిమెల భాస్కర్‌లకు ముఖ్యఅతిథి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి పురస్కారంతో పాటు రూ.50 వేల చొప్పున నగదును ప్రదానం చేశారు. శెట్టి శ్యాం, డి.హరిత, మహాలక్ష్మి, జి.దీక్షిత, శ్రీవర్ధన్, సి.లక్ష్మీనరసింహారెడ్డి, జి.చరణ్‌తేజ, రుత్విక్, మహేశ్వర్, కె.పూజలకు రవ్వా శ్రీహరి యువ ప్రతిభా సంస్కృత పురస్కారాలను అందించారు. రవ్వా శ్రీహరి ఆంధ్ర పద నిధానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, విశ్వనాథ సాహిత్యపీఠం అధ్యక్షుడు డా.వెల్చాల కొండలరావు, సీనియర్‌ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి, ఓయూ విశ్రాంత ఆచార్యుడు కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఓయూ సంస్కృత పూర్వ శాఖాధ్యక్షుడు ఆచార్య ఎ.రాములు, సాహిత్య పరిశోధకుడు డా.శ్రీరంగాచార్య, ఆయుర్వేద వైద్య పరిశోధకుడు డా.భాగవతం రామారావు తదితరులు మాట్లాడారు.  తెలుగు అకాడమీ పూర్వ సంచాలకుడు ఆచార్య కొంక యాదగిరి, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ పిల్లలమర్రి రాములు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని