తొలిరోజు 322 మంది హజ్‌యాత్రకు పయనం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముస్లింల పవిత్ర హజ్‌యాత్ర ప్రారంభమైంది. తొలిరోజైన సోమవారం 322 మంది హజ్‌యాత్రకు బయలుదేరారు.

Published : 28 May 2024 04:45 IST

యాత్రను ప్రారంభిస్తున్న హర్షవర్ధన్, హజ్‌ కమిటీ ఈవో అబ్దుల్‌ ఖదీర్‌ తదితరులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముస్లింల పవిత్ర హజ్‌యాత్ర ప్రారంభమైంది. తొలిరోజైన సోమవారం 322 మంది హజ్‌యాత్రకు బయలుదేరారు. అంతకుముందు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన హజ్‌ శిబిరం వద్ద రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి, హజ్‌ ఆపరేషన్స్‌ ఛైర్మన్‌ హర్షవర్ధన్, హజ్‌ కమిటీ ఈవో అబ్దుల్‌ ఖదీర్, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ అలీం బాషా, జిల్లా ఎస్పీ నయీం అస్మీ యాత్రికులతో మాట్లాడారు. ఈ ఏడాది మూడు విడతల్లో కలిపి 692 మంది యాత్రకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని