కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా అశోక్‌ ఎస్‌ గోయల్‌

కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా అశోక్‌ ఎస్‌ గోయల్‌ను కేంద్రం నియమించింది. జూన్‌ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని జల్‌శక్తిశాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ శర్మ సోమవారం ఆదేశాలిచ్చారు.

Updated : 28 May 2024 06:37 IST

ఈనాడు-అమరావతి: కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా అశోక్‌ ఎస్‌ గోయల్‌ను కేంద్రం నియమించింది. జూన్‌ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని జల్‌శక్తిశాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ శర్మ సోమవారం ఆదేశాలిచ్చారు. కేంద్ర వ్యక్తిగత, శిక్షణ వ్యవహారాలశాఖ ఆయనకు సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ అధికారి నుంచి హయ్యర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా అడ్‌హాక్‌ ప్రాతిపదికన పదోన్నతి ఇచ్చింది. ఆయన పదోన్నతి అంశం దిల్లీ హైకోర్టులో దాఖలైన కేసు తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని