హిందీలో 35 అన్నారు.. మళ్లీ పరిశీలిస్తే 89 మార్కులు

పకడ్బందీగా జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకనంలో ఘోర తప్పిదం చోటుచేసుకుంది. చిత్తూరుకు చెందిన కె.ఉర్జిత్‌ అనే విద్యార్థికి తెలుగులో 95, ఇంగ్లిష్‌లో 98, సైన్స్‌లో 90, సోషల్‌లో 85, హిందీలో 35 మార్కులు వచ్చాయి.

Published : 30 May 2024 04:26 IST

పదో తరగతి పునఃమూల్యాంకనంతో దిద్దుబాటు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: పకడ్బందీగా జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకనంలో ఘోర తప్పిదం చోటుచేసుకుంది. చిత్తూరుకు చెందిన కె.ఉర్జిత్‌ అనే విద్యార్థికి తెలుగులో 95, ఇంగ్లిష్‌లో 98, సైన్స్‌లో 90, సోషల్‌లో 85, హిందీలో 35 మార్కులు వచ్చాయి. హిందీలో తక్కువ మార్కులు రావడంతో కంగుతిన్న విద్యార్థి తల్లిదండ్రులు ఆ సబ్జెక్టు పునఃమూల్యాంకానికి ఫీజు కట్టి దరఖాస్తు చేశారు. తాజాగా పరీక్షల విభాగం నుంచి బుధవారం ఆ విద్యార్థికి జవాబు పత్రం, మార్కుల వివరాలు పోస్టులో అందాయి. అందులో హిందీ సబ్జెక్టులో 89 మార్కులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి ఎంతో ముఖ్యమైన పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ఇలాగేనా చేసేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని