తితిదే ఛైర్మన్‌ కరుణాకరరెడ్డి రాజీనామా

సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి స్పష్టమయ్యాక తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం రాజీనామా లేఖను ఈవో ధర్మారెడ్డికి పంపించారు.

Published : 05 Jun 2024 07:08 IST

తిరుమల, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి స్పష్టమయ్యాక తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం రాజీనామా లేఖను ఈవో ధర్మారెడ్డికి పంపించారు. పాలకమండలి అధ్యక్షుడిగా గతేడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆయన.. అభివృద్ధి పనుల పేరిట తితిదే నిధులను పెద్దఎత్తున గుత్తేదారులకు కట్టబెట్టి వాటాలు పొందారని ప్రతిపక్షాలు పలుమార్లు ఆరోపించాయి. తిరుపతి నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తన తనయుడు అభినయ్‌రెడ్డి గెలుపునకు పరోక్షంగా ఉపకరించేలా ఎన్నికలకు ముందు తరచూ తితిదే బోర్డు సమావేశాలు నిర్వహించి, పలు తీర్మానాలు ఆమోదించినట్లు విమర్శలున్నాయి. అంతకుముందు తితిదే నిధులు రూ.100 కోట్లు తిరుపతి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య పనులకు వెచ్చించేందుకు యత్నించగా, దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు. 

  • తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం నుంచి పది రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నట్లు సమాచారం. ఈనెల 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని