కూటమికి జై కొట్టిన ముస్లిం మైనారిటీలు

ఎంత అన్యాయం చేసినా.. వారి అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకపోయినా మాటలతో మభ్యపెట్టొచ్చు అనేలా ముస్లింల పట్ల వ్యవహరించిన జగన్‌కు వారు బుద్ది చెప్పారు.

Published : 05 Jun 2024 04:58 IST

ఈనాడు, అమరావతి: ఎంత అన్యాయం చేసినా.. వారి అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకపోయినా మాటలతో మభ్యపెట్టొచ్చు అనేలా ముస్లింల పట్ల వ్యవహరించిన జగన్‌కు వారు బుద్ది చెప్పారు. పాలనలో అడుగడుగునా చేసిన అన్యాయానికి వారు ఓటుతో ప్రతీకారం తీర్చుకున్నారు. వైకాపా అరాచకశక్తులు ముస్లింలపై దాడులకు తెగబడుతున్నా.. కళ్లప్పగించి చూసిన ఆయనకు సమయం వచ్చినప్పుడు తాము ఎలా ప్రతిస్పందిస్తామో చూపించారు. వైకాపాకు పట్టుండే రాయలసీమ ప్రాంతంలోనూ ఆ పార్టీ వెన్నువిరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మంది ముస్లిం ఓటర్లున్న 20 నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే.. ఒక్కచోట కూడా వైకాపా గెలుపొందలేదు. వారి జనాభాకు అనుగుణంగా 70శాతం మంది ఓటర్లుంటారని అంచనా. ఆ ప్రకారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో.. అత్యధికంగా మైనారిటీ ఓట్లున్న నియోజకవర్గాలున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదలు హిందూపురం వరకు అన్నిచోట్ల ఒకే ట్రెండ్‌ కొనసాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని