సంక్షిప్త వార్తలు (3)

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును జగన్‌ సర్కారు ఏకపక్షంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య వర్సిటీగా మార్చగా ఆ అక్షరాలను కొందరు తెదేపా

Updated : 05 Jun 2024 07:00 IST

వైఎస్‌ఆర్‌ పేరు తొలగించి.. ఎన్టీఆర్‌ అనే అక్షరాలు ఏర్పాటు చేసి..

విజయవాడ (ఆరోగ్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును జగన్‌ సర్కారు ఏకపక్షంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య వర్సిటీగా మార్చగా ఆ అక్షరాలను కొందరు తెదేపా కార్యకర్తలు తొలగించారు. వైఎస్‌ఆర్‌ స్థానంలో ఎన్టీఆర్‌ అన్న అక్షరాలను అతికించారు. 


రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంబరాలు

కేక్‌ కోస్తున్న ఉద్యోగులు  

ఈనాడు డిజిటల్, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. సచివాలయం నుంచి ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన వైకాపా ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేసిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.


ఏజీ పదవికి శ్రీరామ్‌ రాజీనామా

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో వైకాపా పరాజయం పాలవడంతో రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) సుబ్రమణ్యం శ్రీరామ్‌ తన పదవిని వదులుకుంటూ మంగళవారం రాజీనామా లేఖను సీఎస్‌ జవహర్‌రెడ్డికి పంపించారు. మరోవైపు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు కొందరు రాజీనామా లేఖలను నియామక అథార్టీ అయిన ఏజీకి సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని