రాజధాని రైతన్నల ఉల్లాసం

ఐదేళ్లుగా తమ భూములకు పట్టిన శని పోయిందంటూ అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మధ్యాహ్నానికిలోపే కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతుండటంతో అమరావతి రైతులు సంతోషంతో ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు

Published : 05 Jun 2024 06:28 IST

చంద్రబాబు నివాసం వద్ద ఆనందోత్సాహాలు

ఈనాడు డిజిటల్, అమరావతి: ఐదేళ్లుగా తమ భూములకు పట్టిన శని పోయిందంటూ అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మధ్యాహ్నానికిలోపే కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతుండటంతో అమరావతి రైతులు సంతోషంతో ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పట్టరాని ఆనందంతో నివాసానికి ముందున్న మొదటి, రెండో పోలీసు చెక్‌పోస్టులను దాటి చంద్రబాబు ఇంటి వద్దకెళ్లారు. రైతులు భారీ ఎత్తున తరలిరావడంతో పోలీసులు చేతులెత్తేశారు. రైతులు చంద్రబాబు ఇంటి గేటు వద్దకు చేరుకుని 30 నిమిషాలకుపైగా జై చంద్రబాబు, జై లోకేశ్, చంద్రబాబు సీఎం అనే నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. మిట్టమధ్యాహ్నం తీవ్రమైన ఎండని సైతం లెక్కచేయకుండా మహిళలు, యువత చంద్రబాబు కోసం వేచిచూశారు. అప్పటికే భాజపా రాష్ట్ర ఎన్నికల సహఇన్‌ఛార్జి సిద్దార్థనాథ్‌సింగ్‌ రావడంతో చంద్రబాబు బయటకు రాలేదు. దీంతో పోలీసు బలగాలు చేరుకుని రైతులకు నచ్చజెప్పి బయటకు పంపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని