దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారంటే..!

దేవాదాయ శాఖ మంత్రిగా చేసివారు మళ్లీ గెలవరన్న సెంటిమెంట్‌ బలంగా ఉంది. ఇది.. ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపితమైంది. వైకాపా ప్రభుత్వంలో తొలుత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు.

Published : 05 Jun 2024 06:36 IST

ఈనాడు, అమరావతి: దేవాదాయ శాఖ మంత్రిగా చేసివారు మళ్లీ గెలవరన్న సెంటిమెంట్‌ బలంగా ఉంది. ఇది.. ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపితమైంది. వైకాపా ప్రభుత్వంలో తొలుత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. అనంతరం కేబినెట్‌ విస్తరణలో దేవాదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరూ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలోలాగే ఈ సంప్రదాయం కొనసాగినట్లయింది.

సభాపతిదీ ఇదే దారి

శాసనసభాపతిగా వ్యవహరించినవారు మరోసారి ఎన్నికల్లో గెలవరు. ఈ సంప్రదాయం చాలకాలం నుంచి కొనసాగుతోంది. వైకాపా హయాంలో సభాపతిగా వ్యవహరించిన తమ్మినేని సీతారాం ఆమదాలవలస నియోజకవర్గం నుంచి మేనల్లుడు కూన రవికుమార్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఈయన కంటే ముందు సభాపతిగా చేసినవారూ ఇలాగే తదుపరి ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని