కదం తొక్కుతూ... ముందుకుసాగిన రాజధాని రైతులు..!

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జగన్‌ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కొని రైతులు చేసిన పాదయాత్రలు చరిత్రలో నిలిచిపోతాయి. న్యాయస్థానం నంచి దేవస్థానం వరకు పేరుతో మొదటి పాదయాత్రను తుళ్లూరు నుంచి తిరుపతి వరకు నిర్వహించారు.

Published : 05 Jun 2024 06:37 IST

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జగన్‌ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కొని రైతులు చేసిన పాదయాత్రలు చరిత్రలో నిలిచిపోతాయి. న్యాయస్థానం నంచి దేవస్థానం వరకు పేరుతో మొదటి పాదయాత్రను తుళ్లూరు నుంచి తిరుపతి వరకు నిర్వహించారు. 2021 నవంబరు 1న మొదలైన పాదయాత్ర డిసెంబరు 14న తిరుపతిలో ముగిసింది. మరోసారి 2022 సెప్టెంబరు 12న పాదయాత్రను అమరావతిలో ప్రారంభించారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడంతో అక్టోబరు 22న అప్పటి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం మండలంలో ముగించారు. అదే సంవత్సరం డిసెంబరు 20న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ ప్రదర్శన చేపట్టారు. అంతకు ముందు 2020లో అమరావతి నుంచి విజయవాడలోని కనకగదుర్గమ్మ గుడికి పొంగళ్లు సమర్పించేందుకు కాలినడకన బయల్దేరిన మహిళలు, రైతులపై పోలీసులు దమనకాండకు పాల్పడ్డారు. వారిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఎన్నికల్లో వైకాపాకి మరణశాసనం లిఖించిన అంశాల్లో రాజధాని రైతుల పాదయాత్రలు, వారి సాగించిన ఉద్యమం కీలకమైనవి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని