మిషన్‌ ఏపీ ఎలక్షన్స్‌ అధ్యక్షుడిని అభినందించిన చంద్రబాబు

ఏపీలో ఎన్నికల సందర్భంగా ‘మిషన్‌ ఏపీ ఎలక్షన్స్‌’ ప్రాజెక్టు కింద పనిచేసిన తెలుగు రాష్ట్రాల ఒప్పంద, పొరుగు సేవల సంఘం అధ్యక్షుడు, జగన్నాథ ప్రవీణ్‌ను తెదేపా అధినేత చంద్రబాబు అభినందించారు.

Published : 05 Jun 2024 06:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలో ఎన్నికల సందర్భంగా ‘మిషన్‌ ఏపీ ఎలక్షన్స్‌’ ప్రాజెక్టు కింద పనిచేసిన తెలుగు రాష్ట్రాల ఒప్పంద, పొరుగు సేవల సంఘం అధ్యక్షుడు, జగన్నాథ ప్రవీణ్‌ను తెదేపా అధినేత చంద్రబాబు అభినందించారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు బాలసుబ్రహ్మణ్యం, సాంబశివరావు, లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో చంద్రబాబును ‘మిషన్‌ ఏపీ ఎలక్షన్స్‌’ ప్రాజెక్టు అధ్యక్షుడైన ప్రవీణ్‌ మంగళవారం కలిశారు. తమ ప్రాజెక్టు అమలు ఫలితాల నివేదికను అందజేశారు. కూటమికి అనుకూలంగా నియోజకవర్గాల్లో తిరిగి వివిధ వర్గాల మద్దతు సమీకరించామని, దానికి అనుగుణంగా ఫలితాలు వచ్చాయని ప్రవీణ్‌ వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మిషన్‌ ఏపీ ఎలక్షన్స్‌’ ప్రాజెక్టు ఎన్నికల్లో తమ విజయానికి ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని