నీట్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల సత్తా

నీట్‌-2024 ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య యాజమాన్యం తెలిపింది.

Published : 06 Jun 2024 04:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌-2024 ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య యాజమాన్యం తెలిపింది. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో వి.కల్యాణ్, పి.పవన్‌కుమార్‌ రెడ్డి, ముకేశ్‌ చౌదరి, జి.భానుతేజ సాయి, ఇరాన్‌ ఖ్వాజీ, దర్శ్‌ పగ్దార్, ఇషా కొఠారి, ఆదర్శ్‌ సింగ్‌ మోయల్, అమీనా ఆరిఫ్‌ కడివాలాలు 720 మార్కులు గాను 720 మార్కులు పొంది మొదటి ర్యాంకులు సాధించారని చెప్పింది. 715 మార్కులకు పైగా 28 మంది, 710కి పైగా 55 మంది, 700కి పైగా 124 మంది మార్కులు సాధించారని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ అభినందించారు.


నారాయణ విజయ పరంపర

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ పరంపరను కొనసాగించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. 720కి 720 మార్కులతో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీల్లో 8 ఫస్ట్‌ ర్యాంకులతో తమ విద్యార్థులు రికార్డు సృష్టించారన్నారు. సామ్‌ శ్రేయాస్‌ జోసెఫ్‌ ఆలిండియా 1వ ర్యాంకు సాధించగా.. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో కె.సందీప్‌ చౌదరి, షాహ్, పి.ఆదిత్య కుమార్, శశాంక్‌ శర్మ, ఈషా కొఠారి, ప్రాచిత, దర్శ్‌ పగ్‌దార్‌లు ఫస్ట్‌ ర్యాంకు సాధించారన్నారు. 13 మంది 715 మార్కులు, 20 మంది 710 మార్కులతో రాణించారని వెల్లడించారు. విద్యార్థులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.


తిరుమల విజయకేతనం

ఈనాడు, అమరావతి: నీట్‌ ఫలితాల్లో తిరుమల ఐఐటీ, మెడికల్‌ అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు వెల్లడించారు. పి.బేబీ అభీజ్ఞ 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 27వ ర్యాంకును, పి.శివ సంపత్‌ నాయుడు 715 మార్కులతో 46వ ర్యాంకును సాధించారని తెలిపారు. ఇవేకాక తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో 116, 122, 217, 435.. వంటి అత్యున్నత ర్యాంకులు పొందారన్నారు. విద్యార్థులను అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ వి.శ్రీహరిలతో కలిసి తిరుమలరావు అభినందించారు. 


భాష్యం మెడెక్స్‌ విజయభేరి

ఈనాడు, అమరావతి: నీట్‌ ఫలితాల్లో భాష్యం మెడెక్స్‌ విద్యార్థులు విజయభేరి మోగించారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. తమ విద్యార్థి ఎమ్‌.సాయి జశ్వంత్‌ రెడ్డి 715 మార్కులతో ఓపెన్‌ కేటగిరీలో 90వ ర్యాంకు సాధించారన్నారు. వివిధ కేటగిరీలలో టి.మునికార్తీక్‌ 55వ ర్యాంకు (710 మార్కులు), ఎస్‌.ప్రణయ్‌ విక్టర్‌ 51వ ర్యాంకు (700 మార్కులు)తో పాటు 52 మంది విద్యార్థులు 600లు ఆపైన మార్కులు తెచ్చుకున్నారని వెల్లడించారు. విద్యార్థులు, అధ్యాపకులను ఛైర్మన్‌ రామకృష్ణ, డైరెక్టర్‌ హనుమంతరావు, ప్రిన్సిపాల్‌ బి.హరిబాబులు అభినందించారు.


‘శశి వేలివెన్ను’ ప్రభంజనం

ఈనాడు, అమరావతి: నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని శశి విద్యాసంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ తెలిపారు. 710 మార్కులతో జి.సాయి మనోజ్‌ ఆలిండియా 41వ ర్యాంకు, 710 మార్కులతో ఎం.ప్రణవ్‌ సాయి ఆలిండియా 114వ ర్యాంకు, 705 మార్కులతో ఎల్‌.సత్యవర్ధన్‌ ఆలిండియా 109వ ర్యాంకు, 705 మార్కులతో బి.గౌతమి ఆలిండియా 288వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. 500లోపు ఆలిండియా ర్యాంకులు ఏడుగురు, 1000 లోపు ర్యాంకులు 12 మందికి, 5 వేల లోపు ర్యాంకులు 52 మందికి, 10 వేల లోపు ర్యాంకులు 94 మందికి వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను శశి విద్యాసంస్థల వైస్‌ఛైర్మన్‌ బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ అభినందించారు. 


నీట్‌లో శ్రీగోసలైట్స్‌ అత్యుత్తమ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ ఫలితాల్లో విజయవాడ శ్రీగోసలైట్స్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఛైర్మన్‌ నరేంద్రబాబు తెలిపారు. మొత్తం 720 మార్కులకు గాను తమ విద్యార్థులు 9 మంది 700కు పైగా మార్కులు సాధించారని వెల్లడించారు. 520 మంది విద్యార్థులు 600కు పైన మార్కులు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. 


ఎస్‌ఆర్‌ విద్యార్థుల ప్రతిభ

హనుమకొండ చౌరస్తా, న్యూస్‌టుడే: నీట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఛైర్మన్‌ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. శృతికీర్తి 662, పి.హర్షిత 652 మార్కులతో ప్రతిభ చాటారని చెప్పారు. కె.రమేష్‌ 630, ఎం.కీర్తి 626, టి.శాలిని 621, వి.సాయిప్రసాద్‌ 621 మార్కులు సాధించారని వెల్లడించారు. మరో 105 మందికి పైగా విద్యార్థులు 500, ఆపైగా మార్కులు తెచ్చుకున్నారన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని